పట్టు సాగు చేపట్టిన రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందని జిల్లా పట్టు శాఖ అధికారి డాక్టర్ పి.సుజయకుమార్ తెలిపారు. తూర్పు గంగవరం రైతు భరోసా కేంద్రం వద్ద పట్టు-పొలంబడి కార్యక్రమంలో గురు వారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పట్టు శాఖ అధికారి డాక్టర్ పి.సుజయకుమార్ మాట్లాడుతూ… రైతాంగానికి, రైతుకూలీలకు పట్టు పరిశ్రమ ఏడాదిపాటు పని కల్పిస్తుందని తెలిపారు. మల్బరీ మొక్కలు నాటి 10 ఏళ్ల వరకు అదే తోటపై పట్టుపురుగులు పెంచి, పట్టు దారంకండెల పంటలను తీయవచ్చునన్నారు. పట్టు పురుగుల పెంపకంలో చాకీ పురుగుల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వాతావరణ హెచ్చు తగ్గులను సమన్వయం చేసుకుంటే ఆశించిన దిగుబడులు వస్తాయన్నారు. పట్టు సాగు చేపట్టిన రైతులకు ప్రభుత్వం ఎకరా మల్బరీ సాగు పెంపకానికి రూ.10,500లు, రేరింగ్ గదినిర్మాణానికి రూ 3,00,000లురేరింగ్ స్టాండ్కురూ34,125లురేరింగ్ పరికరాలు, నేత్రికలకు రూ. 18,900లు ట్రేలకు రూ.3210, ఇవ్వటం జరుగుతుందన్నారు. రైతాంగం ఈ ఆవకా శాన్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు. తదుపరి పట్టు పోస్టర్లను రైతులకు ప్రదర్శ నగా వుంచారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు పట్టుశాఖ ఫీల్డ్ అసిస్టెంట్ ఐ. అంజిరెడ్డి, ఏఈవో నాగరాజు, విఏఏ నాగరాజునాయక్, జెడ్ బిఎన్ఎఫ్ ఇంచార్జి పి.నరిశింహులు,విఏఏ లు సుమ, నరేష్, రైతులు పాల్గొన్నారు.
