సినీ హీరో స్వర్గీయ బూచేపల్లి కమలాకర్ రెడ్డి పదో వర్ధంతిని చీమకుర్తిలో గురువారం ఘనంగా నిర్వహించారు. చీమకుర్తి-పాటిమీదపాలెం రోడ్డులోని కమలాకర్ రెడ్డి పార్కులో ఆయన స్మారకాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు.
స్మారకం వద్ద తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సోదరుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే టి. జె. ఆర్ సుధాకర్ బాబు
పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కమలాకర్ రెడ్డి హీరోగా, నిర్మాతగా సాగించిన ప్రయాణాన్ని, కుటుం బ సభ్యులతో గడిపిన మధుర స్మృతులను గుర్తు చేసు కున్నారు. నివాళులర్పించిన వారిలో మున్సిపల్ చైర్మన్ చల్లా అంకులు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్ కమలాకర్ రెడ్డి సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షులు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, రూరల్ మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, మున్సి చైర్పర్సన్ పల్ కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ
నాయకులు ఉన్నారు.
*వైద్య శిబిరానికి విశేష స్పందన*
కమలాకర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా చీమకుర్తిలోని బూచేపల్లి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్య శిబిరానికి 2,400 మంది రోగులు హాజరుకాగా వైద్యులు పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 973 మందిని శుక్లాల ఆప రేషన్ సిఫార్సు చేశారు. బూచేపల్లి అభిమానులు 7 వేల మంది అన్నదానంలో పాల్గొన్నారు.









