స్వర్గీయ సినీ హీరో బూచేపల్లి కమలాకర్ వర్ధంతి సంద ర్భంగా గురువారం చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండ పంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బూచేపల్లి కల్యాణ మండపంలో బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రారంభించారు. కమలాకర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కంటి వైద్యశిబిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ ,బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ..
కమలాకర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కంటి వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన శంకర నేత్రాలయ అధ్వ ర్యంలో నిర్వహించిన వైద్యశిబిరంలో ఆపరేషన్లు అవసర మైన వారందరినీ పెదకాకానికి తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్లు చేయించి మళ్లీ చీమకుర్తి తీసుకొచ్చి వదిలిపెడతామని బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆప రేషన్ కి ఎంపికైన వారిని బ్యాచ్ల వారీగా ప్రత్యేకంగా బస్సు లలో పెదకాకాని ఆస్పత్రికి తీసుకెళ్లనున్నట్లు వారు తెలి పారు. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ …బూచేపల్లి ట్రస్ట్ తరపున నిర్వాహకులు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్ర సాదరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమ న్నారు. సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు బూచేపల్లి కుటుంబం అని ఎమ్మెల్యే టీజేఆర్ కొనియాడారు. బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాదరెడ్డి సతీమణి నందిని కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
వైద్య పరీక్షలు చేయించుకున్నవారిలో 973 మందికి కం టీ ఆపరేషన్లు అవసరమని డాక్టర్లు నిర్ధారించారు, కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారిని దశల వారీగా పెద కాకాని ఆస్పత్రికి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయించనున్నట్లు బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాదరెడ్డి తెలిపారు.ఆపరేషన్లు అవసరం లేని వారికి ఉచితంగా అవసర మైన మందులు అందించారు. కమలాకర్ రెడ్డి వర్ధంతి సంద ర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో చీమకుర్తి మండలంలోని అన్ని గ్రామాల నుంచి 7 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. వైద్యశిబిరం ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ చల్లా అంకులు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ రూరల్ మండల కన్వీనర్ పమిడి వెంకటే శ్వర్లు, చీమకుర్తి పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, జెడ్పీ టీసీ మాజీ సభ్యుడు గోగినేని వెంకటేశ్వర్లు స్థానిక డాక్టర్లు బీ జవహర్, సీహెచ్ వెంకటేశ్వర్లు, స్థానిక మున్సిపల్ కౌన్సి లర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.








