దర్శి నగర పంచాయతీలో తాగునీటి సర ఫరాను మెరుగుపరిచేందుకు రూ.121 కోట్ల నిధులు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దానికి సంబంధించి 2.0 కింద జీవోఎంఎస్ నంబర్ 12ను మున్సిపల్ అడ్మి నిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ విడుదల చేసినట్లు చెప్పారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. సమాచారం నిమిత్తం వెబ్సైట్లో ఉంచిన ప్రాజెక్ట్ వివరాలను చూసుకుని అభ్యంతరాలు, సలహాలు ఉంటే ఈ నెల 19వ తేదీలోపు అదే వెబ్సైట్లో నమోదు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వివరించారు .
దర్శిలో తాగునీటికి రూ.121 కోట్లు మంజూరు -ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి వేణుగోపాల్ వెల్లడి
14
Jul