లబ్ధిదారుల చేయూతకే
జగనన్న సురక్ష కార్యక్రమం లక్ష్యంగా పనిచేస్తుందని ఈఓఆర్డి కేజిఎస్ రాజు అన్నారు. తాళ్లూరు మండలంలోని నాగంబొట్లవారిపాలెం గ్రామంలో సచివాలయం వొద్ద గ్రామ సర్పంచ్ సిహెచ్ సుబ్బారావు అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈఓఆర్డి కేజిఎస్ రాజు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో గ్రామ వలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని గుర్తించి వారికి అవసరమైన సర్టిఫికెట్ల కొరకు అన్ని అంశాలను స్వయంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రామభద్రా పురం సర్పంచ్ బాపిరెడ్డి నాగిరెడ్డి సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాసరెడ్డి, మండల వ్యవసాయ అధికారి బి. ప్రసాద్ రావు, డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానుయేలు రాజు , వి.ఆర్. ఓ చంద్రశేఖర్, కార్యదర్శి నరేంద్ర, పాల్గొన్నారు.


