తాళ్లూరు మండలం ఇన్చార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి వై. శ్రీనివాసరావు అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కు తాళ్లూరు మండల ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు . కలెక్టర్ విచారించి తగిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు శనివారం ఒంగోలులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కలిసి ఎంపీడీఓ అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పలు అక్రమాలపై ప్రజాప్రతినిధులు కలెక్టర్ కు వివరాలు అందజేశారు. ప్రజాప్రతినిధలనే గౌరవం కూడా లేకుండా మమ్ములను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే చాలా మంది ఆయనకు లంచాలు ఇచ్చారని వారి వివరాలు కలెక్టర్ కు తెలిపారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రతి పనికి లంచం అడుగుతూ ప్రజా పనిధులు పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని,
ఇబ్బంది పెడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే చాలా మంది ఆయనకు లంచాలు ఇచ్చారని వారి వివరాలు కలెక్టర్కు తెలిపారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రతి పనికి లంచం అడుగుతూ ,పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. లంచం ఇస్తేనే పని చేయాలనే ధోరణిలో ఆయన ఉన్నరన్నారు. కింది స్థాయిలో పని చేసే సిబ్బందికి సైతం ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఆయన చెప్పినట్టు చేయకుంటే మెమోలు జారీ చేస్తూ వారిని భయపెడుతున్నారని తెలిపారు. మద్దిపాడులో ఉంటూ తాళ్లూరుకు సక్రమంగా రాకుండా ఎలాగైనా వేళ్లాలనే ఆలోచనతో ఇక్కడ అందరిని ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజా ప్రతినిధులకు ఎంపీపీకి కనీసం నోట్ ఫైలు కూడా పంపకుండా ,ఎలాంటి సమాచారం లేకుండా చేసి ప్రజా ప్రతినిధులను అగౌర పరచడం ఎంతవరకు సమంజసం అని కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లారు. పూర్తి స్థాయిలో ఎంపీడీఓ అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని ప్రజాప్రతినిధులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పిటిసి మారం వెంకట రెడ్డి , మండల కో ఆప్షన్ సభ్యులు కరిముల్లా, సర్పంచ్లు మేకల చార్లెస్ సర్జన్, షేక్ వలి, పి .ఎస్. శ్రీకాంత్ రెడ్డి వరలక్ష్మి , వైసిపి మండల కార్యదర్శి యాడిక యలమందారెడ్డి , గుంటి గంగా భవాని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లు ఆంజనేయులు, కటకం శెట్టి శ్రీనివాసరావు ,సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఏఎంసి డైరెక్టర్ రమణారెడ్డి , ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పూనూరు దేవదానం , కొర్రపాటి వారి పాలెం జే సి ఎస్ కన్వీనర్ విష్ణు, నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (చందన), కోట వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కు అందించిన వినతిపత్రంలో పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి…
మహా రాజ శ్రీ గౌరవనీయులైన కలెక్టర్ మరియు
ప్రకాశం జిల్లా మేజిస్ట్రేట్ వారి దివ్య సముఖమునకు,
శ్రీ తాటికొండ శ్రీనివాస రావు , అద్యక్షులు , మండల
ప్రజా పరిషత్, తాళ్ళూరు వారు సమర్పించుకున్న దరఖాస్తు.
ఆర్యా !
మద్దిపాడు ఎంపీడీవో గారు వై శ్రీనివాసరావు గారిని తాళ్లూరు మండలంలోకి రెండు నెలల క్రితం ఎంపీడీవో గా ఇన్చార్జిగా విధులకు హాజరుఅయినారు వచ్చిన దగ్గరనుంచి సెక్రెటర్స్ లతో మీటింగ్ పెట్టేటప్పుడు ఎంపీపీ గారికి మరియు జడ్పిటిసి గారికి మరియు సర్పంచులకు అలాగే మండలంలోని M P T C లందరకు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు , నేను ఏమి చేస్తే అదే చేయాలి ఎవరితో అవసరం లేదు మీరు మాత్రం నేను చెప్పినట్లే చేయకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతానని బెదిరిస్తున్నాడు మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి అనే నాయకున్ని సచివాలయం కాంట్రాక్ట్ చేస్తే వారికి అమౌంటు మండలానికి వస్తే నాకు అమౌంట్ ఇస్తే నేను కీ పెడతాను అని చెప్పడం జరిగింది, సరే అని ఆయన అమౌంటు లేక వడ్డీకి తెచ్చి ఇవ్వాలని మండలానికి వెళ్లి 20000 రూపాయలు ఇచ్చాడు ఈలోపు మండల గ్రాంట్ వెనక్కి వెళ్లిపోయాయి మండల గ్రాంటు అ గ్రామానికి 1,80,0000 ఎంపీపీ గారి ఇస్తే దానికి శాంక్షన్ చేయడానికి అమౌంట్ ఇస్తే చేస్తానని అడగటం జరిగింది 7000 ఇచ్చాడు ప్రతి ఒక్కరి దగ్గర లంచం ఇస్తేనే పనిచేస్తానని అంటున్నాడు అధ్యక్షులు మండల డెవలప్మెంట్ కోసం ఎంపీపీ అయిన దగ్గరనుంచి ప్రతి నెల అన్ని డిపార్ట్మెంట్లతో మీటింగ్లు పెట్టి అందరితో కలిసి గ్రామాలలో సమస్యలు లేకుండా పనిచేయాలని చెప్పడం జరుగుతుంది ఈమధ్య తేదీ 11/7/2023 సెక్రెటరీ మీటింగ్ పెడితే వాళ్ళకి ఫోన్ చేసి EO(PR&RD) గారికి మరియు పంచాయతి కార్యదర్శి లకు ఫోన్ చేసి ఎవరు వెళ్ళవద్దు ఆయన ఎవరు MPP మీటింగ్ పెట్టటానికి మీరు వెళ్తే మీకు మెమోల్ ఇస్తాను అని బెదిరించడం జరిగింది , ఫీల్డ్ అసిస్టెంట్లతో మీటింగ్ పెట్టి కూలీల మచ్చర్లు కొట్టి నాకు సగం మీకు సగం తీసుకోవడం జరిగింది నేను చెప్పిందే మీరు వినాలి అంటూ అలాగే జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎంపీపీగా నాకు నోట్ ఫైల్ పెట్టకుండా ఆయన సొంతంగా డేట్ షెడ్యూల్ తయారు చేసి చేశారు ,అలాగే వాలంటీర్లు ఒకటి రెండు రోజులు విధులకు హాజరుకాలేక పోయిన వారి జీతం కట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి ఉన్నారు అలాగే ఎమ్మార్వో డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఎంపీడీవో గారు చేయుచున్నారు ఇలాంటి ఆఫీసరు మాకు వద్దు దయచేసి మాకు న్యాయం చేయగలరని మిక్కిలిగా ప్రార్థించుచున్నాము .
భవదీయుడు
అద్యక్షులు
మండల ప్రజాపరిషత్ ,తాళ్ళూరు


