ముండ్లమూరు మండలంలోని వేంపాడు గ్రామంలో శనివారం బాల్య వివాహాన్ని అడ్డుకున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ కమల కుమారి తెలిపారు. ముండ్లమూరు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి పూర్తి చేసిన గ్రామానికి చెందిన బాలికకు తం డ్రి లేకపోవడంతో తల్లి కోటేశ్వరమ్మ 17 ఏళ్లకే వివాహం చేస్తోంది. స్థానిక మహిళా సంరక్షణ కార్యదర్శి ద్వారా సమాచారం అం దుకున్న ఐసీడీఎస్ సిబ్బంది సూపర్వైజర్ కమలకుమారికి తెలిపారు. ఆమె స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలికతో పాటు ఇరు కుటుంబాలను పిలిపించి ఎస్సై యూవీ కృష్ణయ్య, ఎంపీడీవో కుసుమకుమారి, సూపర్వైజర్ కమలకుమారి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలికను మళ్లీ అదే పాఠశాల లో తరగతిలో చేర్పించారు.
ముండ్లమూరు మండలంలో బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ సిబ్బంది
16
Jul