జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారికి ఆదివారం విశేష
పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యార్థులకు హోమ్ సిక్ హాలిడేస్ కావటం తో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చు కున్నారు . పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు 12 చీరలు బహుకరించారు. ఆలయానికి రూ. 16,914ఆదాయం వచ్చినట్లు ఆర్ఎ శ్రీనివాసరావు తెలిపారు. సౌకర్యాలను ఈఓ భాస్కర్ రెడ్డి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ కటకం శెట్టి శ్రీనివాసరావు, ఆలయ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

