జలజీవన్ మిషన్ ను విజయవంతం చేయండి – ప్రతి ఇంటికి నీరు అందించడమే లక్ష్యంగా జల జీవన్ మిషన్ ఏర్పాటు

తాళ్లూరు మండలం నాగ బొట్లపాలెం గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేయనున్న ఇంటింటి కొలాయి పథకంను విజయవంతం చేయాలని వక్తలు అన్నారు . గ్రామంలో సోమవారం జల జీవన్ మిషన్ ఏర్పాటుపై గ్రామసభను సర్పంచ్ చెమట సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు . కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రాజెక్టు మెనేజర్ సుధీర్ మాట్లాడుతూ గ్రామంలో పొదుపు సంఘాల ఆధ్వర్యంలో జె .జె .ఎం నిధులు రూ. 1.14కోట్ల వ్యయంతో ఇంటింటికి కొలను నిర్వహించినట్లు తెలిపారు. గ్రామస్తులు సహకరించి విజయవంతానికి కృషి చేయాలని కోరారు .జిల్లా కోఆర్డినేటర్ మోహన్, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాసరెడ్డి , జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు సోము అనిల్ కుమార్ రెడ్డి , ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస రావు , ఏపీఎం దేవరాజ్ , గ్రామ కార్యదర్శి నరేంద్ర , గ్రామ సమైక్య అధ్యక్షులు మరియు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *