టిడిపి బీసీ సెల్ నియామకం-20 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు

దర్శిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి సమక్షంలో దర్శి నియోజకవర్గ బీసీ సెల్ కమిటీని ప్రకటించారు.అధ్యక్షునిగా దొనకొండ మండలానికి చెందిన మోడి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా దర్శి టౌన్ కు చెందిన నీలిశెట్టి వెంకట నారాయణ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిటీకి ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసి రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరూ బాగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి, దొనకొండ, ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు చిట్టె వెంకటేశ్వర్లు, నాగులపాటి శివ కోటేశ్వర రావు, కూరపాటి శ్రీను, పార్లమెంట్ బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి బేళ్ళ శ్రీనివాస రావు, కమిటీ సభ్యులు , నాయకులు పాల్గొన్నారు.
దర్శి నియోజకవర్గ టీడీపీ బీసీ కమిటిలో తాళ్లూరు మండలంలోని నలుగురికి స్థానం…
దర్శి నియో జకవర్గ టీడీపీ బీసీ కమిటీ కార్యనిర్వహక కార్యదర్శులుగా బూచిరాజు (శివరాంపురం) ,మేకల నాగేంద్రబాబు(నాగంబొట్లపాలెం), కార్యదర్శిగా వంగపల్లి నాగేశ్వరరావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ చెన్నారపు నాగేశ్వరావులను నియమించారు. తమ నియామకానికి సహకరించిన రాష్ట్రపార్టీ టీడీపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయు డు,ఒంగోలు పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ బీసీ జనార్దన్ రెడ్డి, పార్లమెంట్ అధ్య క్షులు నూకసాని బాలాజీ, దర్శి మాజీ శాసన సభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరిలకు కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *