ప్రకృతి వ్యవసాయ సాగు ద్వారా రైతులు చిరుధాన్యాలు పండించాలని మండల వ్యవ సాయాధికారి బి .ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగ వరం గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో సోమవారం మహిళా రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాగు భూమిలో సగభాగం మహిళా రైతులు చిరుధాన్యాలు సాగు చేసేటట్లు చూడాలని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిరు ధాన్యాలు పండించే రైతులకు మినీ కిట్లు ఉచితంగా అందించి నాణ్యమైన చిరుధాన్యాల సాగు చేయడంలో సహాయ, సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రకృతి సాగు మండల ఇన్చార్జ్ పి నరసింహులు, ఐ సి ఆర్ పి రమేష్, సలహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
