తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామంవద్ద దర్శి ఎం.వి.ఐ పి. రవికుమార్ వాహ నాలను మంగళవారం తనిఖీ చేశారు. బీఅనుమతి పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులేకుండా రోడ్డుపై వెలుతున్న 6 మోటార్ సైకిళ్లు, ఒక నాలుగు చక్రాలవాహనాన్ని సీజ్ చేశారు. ఈ సందర్బంగా ఎం వి ఐ రవికుమార్ మాట్లాడుతూ… రోడ్లపై వాహనాలు నడిపే వాహన దారులు తప్పని సరి గా లైసెన్సు, వాహన అనుమతి పత్రాలుపొంది వుండాలన్నారు. అలా కాకుండా రోడ్డు పైకి వాహనాలు వస్తే సీజ్ చేస్తామని తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను తాళ్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు.
