ప్రతి అధికారి ఇంటింటినీ సర్వే చేయడంలో భాగం గా ప్రతి ఓటరును కలిసి వివరాలు సేకరించాలని ఎలెక్ట్రో రల్ రిజిస్ట్రేషన్ అధికారి యంవీయస్ లోకేశ్వరరావు సూచించారు. దర్శి శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో దర్శి నియోజకవర్గంలోని దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల తహసీల్దార్లు, సూపర్ వైజర్లు, 282 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బూత్ లెవల్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎలెక్ట్రో రల్ రిజిస్ట్రేషన్ అధికారి యంవీయస్ లోకేశ్వరరావు మాట్లాడుతూ… ఇంటింటి సర్వేలో డోర్ నంబర్లు నమోదు చేసేందుకు సహకరించాలని కోరారు. 100 సంవత్స రాల పైబడిన వారు, ఒకే డోర్ నంబరులో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు, తప్పుగా నమోదు అయిన డోర్ నంబర్లు సరిచేసే విధానం పై వివరించారు. దర్శి, కురిచేడు, ముండ్లమూరు, దొనకొండ తహసీల్దార్లు కె. వెంకటేశ్వర్లు, జ్వాలా నరసింహం, నయీమ్ అహమద్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

