సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ స్టీరింగ్ కమిటీ సమావేశం-వన్యప్రాణుల సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలి -ముఖ్యంగా సోలార్ ఫెన్సింగ్,సోలార్ బోర్ వెల్ లు ఏర్పాటు చేయాలి- కొత్తగా పోడర్ ప్లాట్లు ఏర్పాటు చేయండి

రాష్ట్రంలో ఎపి బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ ద్వారా ఈఏడాది అనగా 2023-24లో 8 కోట్ల రూ.ల వ్యయంతో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి చెప్పారు.బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఎపి బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈసందర్భంగా ఎపి బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలను సిఎస్ సమీక్షించారు.గత ఏడాది ఈసొసైటీ ద్వారా 6 కోట్ల రూ.లతో చేపట్టిన వివిధ కార్యక్రమాలను సమీక్షించారు.అలాగే ఈఏడాది 8 కోట్ల రూ.లతో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు.వన్యప్రాణుల సంరక్షణకు మరిన్ని పగడ్బందీ చర్యలు చేపట్టాలని చెప్పారు.ముఖ్యంగా వన్య ప్రాణులు ప్రమాదాలకు గురి కాకుండా సోలార్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేయాలని అన్నారు.అలాగే వాటికి పూర్తి స్థాయిలో ఆహారం అందే విధంగా ప్రత్యేక పోడర్ ప్లాట్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి చెప్పారు.
అంతకు ముందు ప్రిన్సిపల్ చీఫ్ కన్సరేవేటర్ ఆఫ్ పారెస్టు(పిసిసిఎఫ్)వై.మధుసూదన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బయోసాప్ కు సంబంధించి తీసుకుంటున్నచర్యలను వివరించారు.ముఖ్యంగా గత ఏడాది సుమారు 6 కోట్ల రూ.లతో వివిధ కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు.వాటిలో రాష్ట్రంలో 8 బేస్ క్యాంపుల నిర్వహణ,అటవీ ప్రాంతంలో వివిధ తాగునీటి వనరుల పూడికతీత,ఫైర్ లైన్స్ నిర్వహణ,పోడర్ ప్లాట్ల అభివృద్ధి,ఎలిఫెంట్ ట్రాకర్లు, కెమెరా ట్రాఫ్ల ఏర్పాటు,అటవీ జంతువుల దాడిలో చనిపోయిన,గాయపడిన వారికి నష్ట పరిహారం వంటి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు.ఈఏడాది సుమారు 8 కోట్ల రూ.ల బయోసాప్ నిధులతో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు.ముఖ్యంగా బేస్ క్యాంపుల నిర్వహణతో పాటు సోలార్ బోర్ వెల్స్,పంపుసెట్లు ఏర్పాటు,నూతన సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.అదే విధంగా 75 హెక్టార్లలో అదనంగా పోడర్ ప్లాట్లు అభివృద్ధి చేయడం,మరిన్నిసిసి కెమెరాలు,కెమెరా ట్రాఫ్లు ఏర్పాటు వంటి చర్యలు చేపట్ట నున్నట్టు చెప్పారు.ఇంకా వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈసమావేశంలో ఇఎఫ్ఎస్టి ప్రత్యేక కార్యదర్శి డా.పివి.చలపతిరావు,అదనపు పిసిసిఎఫ్ వైల్డ్ లైఫ్ శాంతిప్రియ పాండే,ఎపి బయోడైవర్సిటీ బోర్డు అధ్యక్షులు బిఎంకె.రెడ్డి,ఇంకా పలువులు అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *