ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తాళ్లూరు మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం 2023-2024 సంవత్సరానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. తాళ్లూరు మండలం లోని వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వ హించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకా జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు లెవి ప్రసాద్, మండల నాయకులు కొమ్మినేని శేషు, నారిపెద్ది శ్రీను, సంగు రవిచంద్రారెడ్డి, పోలంరెడ్డి సుబ్బారెడ్డి, ఖాజావలి, జవహర్ బాబు లు పాల్గొన్నారు.

