తాళ్లూరు మండలంలోని దోసకాయలపాడు ఎస్సీ కాలనీలో పారి శుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓఆర్డీ కేజీఎస్ రాజు తెలిపారు. ఎస్సీ కాలనీలో గురువారం ఆయన సిబ్బం దితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మురుగు నిల్వలను పరిశీలించారు. వాటిని శుభ్రం చేయించారు. కాలనీలో మురుగు నీరు బయటకు వెళ్లే వీలు లేనందున అందు కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ఎస్జీ మేషన్ వేయించాలని ఇంజినీరింగ్ అసిస్టెంట్ ను ఈఓఆర్డీ ఆదేశించారు.



