వైస్సార్సీపీ నాయకుడు, విద్యావేత్త, పేదల పాలిట పెన్నిధి డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ అనతి కాలంలోనే ప్రజల అదరాభిమానాలు విశేషంగా పొందుతున్నారు . మారుమూల చిన్న పల్లె టూరులో జన్మించిన మద్దిశెట్టి సోదరులు అకుంఠిత దీక్ష తో స్వయం కృషి తో ఉన్నత విద్యను అభ్యసించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్య ను అందించేందుకు పేస్ ఇంజినీరింగ్ కళాశాల ను స్థాపించారు. అనంతరం పేదలకు సేవ చేయాలను ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అన్న డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ను ఎమ్మెల్యేగా చేసేందుకు.. రామ లక్ష్మణ్ ల వలె మద్దిశెట్టి రవీంద్ర, మద్దిశెట్టి శ్రీధర్, మద్దిశెట్టి వాసు లు కృషి చేశారు . నిత్యం ప్రజలతో ఆయా మండలాల్లో మమేకమై ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ వారి సమస్యలను తీర్చారు. దర్శి నియోజకవర్గంలో ఎప్పటినుండో. .. ఉన్నటువంటి చిరకాల సమస్యలను తీర్చడంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కు తనుముందు చేయూత ను అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కార్యకర్తలు కు చిన్నపాటి సమస్య వచ్చిన ముందుండి సమస్యను తీర్చడంలో సఫలీకృతులైనాడు. ఎన్ని ఇబ్బందులు వొచ్చినా సరే.. తమతో విభేదించిన వారికి సైతం.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ మాటను నిలబెట్టుకుంటూ.. తమకంటూ దర్శి నియోజకవర్గం తో పాటు జిల్లాలో విద్య, రాజకీయ రంగాలలో ఒక ప్రముఖ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పుట్టినరోజును కార్యకర్తలు పెద్ద పండగ వలె చేసుకునేందుకు సమాయత్తమైనారు. డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ అందరివాడిగా…. ప్రజా అభిమాన ధనుడుగా కొనసాగుతున్నారు. ఆదివారం పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ …జర్నలిస్ట్స్ డిజిటల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నారు.
MaddisettyVenuGopal #DarsiMLA #YSRCP #YSR #YSJagan #APCM #YSJaganMarkGovernance



