మిషన్ ఇంద్రధనస్సు సర్వే, ఆరోగ్య కేంద్రం పరిశీలన – మిషన్ ఇంద్రధనస్సు సర్వే పై సంతృప్తి వ్యక్తం చేసిన మిషన్ ఇంద్ర ధనుస్సు రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజరు డాక్టరు అంజన్ సత్తారాజ్

తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మిషన్ ఇంద్ర ధనుస్సు రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజరు డాక్టరు అంజన్ సత్తారాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీ పరిసరాలను తిరిగి వివిధ దస్త్రాలను పరిశీలించారు. మిషన్ ఇంద్ర ధనస్సు సర్వే తీరును గమనించారు. అధికారులు, సిబ్బందితో కలిసి తాళ్లూరు-2 సచివాలయం పరిధిలోని ఎస్టీ కాలనీ, కొర్రపాటివారిపాలెంలో టీకాల నిర్వహణ తీరుపై విచారించారు. ఇంద్ర ధనుస్సు సర్వే నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఇమ్యునైజే షన్ అధికారిణి డాక్టరు పద్మజ, జిల్లా ఆరోగ్య పర్యవేక్షకులు జవహార్ అలీ, వైద్యాధికారిణి డాక్టరు షేక్ ఖాదర్ మస్తాన్ బి, పి.రవి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *