తాళ్లూరు మండల కేంద్రంలోని వీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా కొండపల్లి ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా చీరాలలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల పని చేస్తున్న ఆంజనేయులు ను తాళ్లూరుకు బదిలీ చేశారు. ఇక్కడ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గా ఉన్న ఇంగ్లీష్ లెక్చరర్ టి. తారకనాథ్ ను టంగుటూరు జూనియర్ కళాశాలకు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ వచ్చిన ఆంజనేయులు ఇదే కళాశాల్లో పదో తరగతి వరకు విద్యనభ్యసించారు. దీంతో ఆయనకు అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ఇతర సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
