వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. భారతి దర్శి సీనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. కేసుల రికార్డులను పరిశీలించారు. సీనియర్ సివిల్ జడ్జి జీఎల్వీ ప్రసాద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోర్టు ఆవరణలో ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. తొలుత కోర్టు ఆవరణలో న్యాయమూ ర్తికి పోలీసులు సెల్యూట్ తో ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని రామాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి జీవీఎల్. సరస్వతి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి. గంగాధర్, ఏజీపీ శ్రీనివాసశాస్త్రి, న్యాయవా దులు కోటిరెడ్డి, సురేష్, మంజుల, యామిని, రాజ్యలక్ష్మి, సుబ్బారెడ్డి, పట్టాభిరామిరెడ్డి, రాజశేఖర్, రామాంజనేయులు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


