జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావు ఆధ్వర్యంలో పూజలు
నిర్వహించారు. అమ్మవారికి భక్తులు ఐదు చీరలు బహుకరించారు. ఆలయానికి రూ. 9.048 ఆదాయం వచ్చినట్లు ఆర్ఎ శ్రీనివాసరావు తెలిపారు. సౌకర్యాలను ఈఓ భాస్కర్ రెడ్డి, ఆలయ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

