మణిపూర్‌లో జరుగుతున్న అమానుష, అఘాయిత్యాలు ఆపాలని, శాంతిని పునరుద్ధరణ చేయాలని, కేంద్ర ప్రభుత్వం భాధ్యత వహించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగిపోవాలని , సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని సిపియం దరిశి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు డిమాండ్ చేశారు.
దరిశిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మణిపూర్ లో జరుగుతున్న మారణకాండ, సామూహిక అత్యాచారాలను నిరసిస్తూ దరిశి MDO ఆఫీసు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం నుంచి క్యాండిల్ నిరసన ప్రదర్శన గడియారం స్థంభం వరకు జరిగింది.
ఈ సందర్భంగా సిపియం దరిశి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ ….. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో ఆర్.ఎస్.ఎస్ సంఘం మెజారిటీ మైతేయి గిరిజన తెగకు అండగా ఉండి, మైనారిటీ కుకీ తెగపై మారణ హోమం జరుపుతుందని , పోలీసులు నుంచి తుపాకులు లాక్కోవడం , బాంబులు వేయడం చేస్తూ మహిళల నగ్నంగా ఊరేగింపులు , సామూహిక అత్యాచారాలు , గృహా దహానాలు , సజీవ దహానాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమక్షంలోనే చేస్తున్నారని , అల్లర్లును అరికట్టాల్సిన రాష్ట్ర బిజెపి ప్రభుత్వం మైతేయి అల్లర మూకల పక్షం వహించి , ఘటనలను బయట ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ నిషేధించిందని తెలిపారు. రాష్ట్రం రావన కాష్టంగా మారిందని ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని , ఉన్మాధం తలకెక్కితే సమాజం ఎలా ఉంటుందో మణిపూర్ లో జరిగిన ఘటనలు రుజువు చేస్తున్నాయని , మెజారిటీ ఓట్లు కోసం బిజెపి , ఆర్.ఎస్.ఎస్ చేస్తున్న ప్రయోగలలో ఇది ఒకటని తెలిపారు….
గత 80 రోజులుగా రెండు తెగలు మధ్య జరిగిన ఘర్షణలో 350 మంది మృతి చెందటం, 357 చర్చిలను కూల్చడం , కాల్చివేయడం జరిగిందని ఇంత విద్వాంసం జరుగుతున్న మన ప్రధాని మాట్లాడటం లేదని , హొం శాఖ మంత్రి అమిత్ షా ఏమి చేస్తున్నారని , రాష్ట్ర ముఖ్యమంత్రి దాడులు చేస్తున్న మైతేయి తెగకే సపోర్ట్ చేస్తూ అగ్నికి ఆజ్యం పోశారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే శాంతిని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు… ఈ నిరసనలలో సిఐటియు , రైతు , DYFI , మహిళా , SFI ప్రజా సంఘాల నాయకులు సందు వెంకటేశ్వరరావు , కె.వి పిచ్చయ్య , ఉప్పు నారాయణ , ఈమని నాగేశ్వరరావు , జాన్ సామ్యూల్ , లక్ష్మీ , రంగమ్మ , పద్మావతి , గోగు వెంకయ్య , సి.హెచ్ ఆదినారాయణ ,షేక్ మున్నా , రంగనాయకులు , షేక్ భాషా పాల్గొన్నారు


