ఆధ్యాత్మిక విశ్వ గురువులు, సైంటిఫిక్ సెయింట్ మరియు పూర్ణ గురువులు అయిన శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారి శిష్యులు ఒక రోజు సాధన శిబిరాన్ని తూర్పు గంగవరం శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఉదయం 5.30 కి ప్రారంభం అయిన ఈ కార్యక్రమం లో యోగాసన – ప్రాణాయామ – ధ్యాన సాధన మరియు మనిషి జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా శ్రీ గురుదేవులు అందించిన జ్ఞానాన్ని బోధించారు. యోగాసనములలోని మెలకువలను, ప్రాణాయామం వల్ల పొందే లాభాలు, ధ్యానం ద్వారా మనిషి వ్యక్తిత్వం, మనసు మారి కుటుంబం మరియు సమాజం మారేలా మనిషి పాటుపడేలా కార్యక్రమంలో థియోరి మరియు ప్రాక్టికల్స్ శ్రీ గురువుల ఉద్బొదనలను అనుసరించి చెప్పడం జరిగింది. ఉచితంగా స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఆంధ్ర ప్రదేశ్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తూర్పు గంగవరం వాస్తవ్యులు పాల్గొని ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు జరగాలి అని కోరుకున్నారు.
