తాళ్లూరు మండలం లోని నాగంబొట్లపాలెం గ్రామంలో ఆదివారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంఐసీఆర్పీ మాట్లాడుతూ …… జామ, బత్తాయి ఇతర పంటలకు చేపల వేస్ట్, కట్టెల బొగ్గుపొడి, నల్లబెల్లంతో చేప ద్రావణం ఎలా తయారు చేసుకో వాలో రైతులకు చూపించారు. ఫిష్ అమినో యాసిడ్ తయారుచేసిన 15 రోజుల తర్వాత పిచికారి చేయాలని, దీనివల్ల చెట్లకి కావాల్సిన పోషకాలు ఆకులు ద్వారా అందుతాయని తెలిపారు. ఉదయం మాత్రమే పిచికారి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీఆర్పీ నరేష్,సిహెచ్ వెంకట్రావు, రైతుల తదితరులు పాల్గొన్నారు.
చేపల వ్యర్థాలతో పంటకి లాభం
23
Jul