సీబీఎస్ఈలో తెలుగు  మీడియం

కేంద్ర ఉన్నత విద్య బోర్డు (సీబీఎస్ఈ)కు చెందిన పాఠశాలల్లో ఇకపై తెలుగులో కూడా బోధన మొదలుకానుంది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన మీడియం భాషలుగా తెలుగు సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈమే రకు ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రాంతీయ భాషలు, వివిధ మాతృభాషలు బోధనభాషల్లో చేరిన నేపథ్యంలో విద్యార్థులకు భాషాపరమైన వైవిధ్యం, సమగ్రమైన బోధన అనుభవం లభిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా వివరించారు. ఆంగ్లం, హిందీలతో పాటు ఇతర భాషల్ని కూడా బోధనకు పరిగణించా లని ఇటీవల విడుదల చేసిన ఓ సర్కులర్ లో సీబీఎస్ఈ తమ పాఠశాల లకు సూచించిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యం కల్పించాలన్న జాతీయ విద్యావిధానం (ఎన్ఎస్ఈపీ) మార్గ దర్శకాలను అనుసరించి బోర్డు తాజా నిర్ణయాన్ని తీసుకుందని ప్రధాన్ తెలిపారు. “మాతృభాషలో నేర్చుకుంటే విద్యార్థులకు పాఠ్యాంశాలు త్వరగా అర్థమవుతాయి. 22 భాషల్ని కూడా బోధన మీడియంలో భాగంగా చేయడం వలన విద్యార్థులు తమ ప్రాంతీయ భాషల ద్వారా విషయాల్ని అర్థం చేసుకుని, మరింత మెరుగ్గా రాణించగలుగుతారు” అని మంత్రి పేర్కొన్నారు. కాగా.. తాజా మార్పుకు మద్దతుగా జాతీయ విద్యాపరిశోధ న-శిక్షణ(ఎన్సీఈఆర్టీ) కొత్త భాషల్లో పాఠ్య పుస్తకాలను తీసుకురా నుంది. ఇక పరీక్షల్ని కూడా ఆయా విద్యార్థుల బోధన భాషల్లోనే నిర్వహిం చనున్నట్లు తెలుస్తోంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *