అమరావతి అందరిదీ -పేదల కోసం మూడేళ్లుగా పెత్తందారులతో మీ బిడ్డ పోరాటం- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -పేదలకు స్థలాలివ్వకుండా, ఇళ్లనుకట్టనివ్వకుండా ఎన్నో ఆటంకాలు అవరోధాలను అధిగమించి ఇవాళ-చంద్రబాబు, దత్తపుత్రుడు, అనుకూల మీడియాఅడుగడుగునా అడ్డు తగిలారు. ఎంతో సంఘర్షణ, ఎన్నెన్నో అవరోధాలు అధికమించి 50,793 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం

పేదలకు మేలు జరిగే ప్రతి విషయంలో మనందరి ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పేదలకు మంచి జరగకూడదని వాళ్లు బుద్ధితో అడ్డుకుంటున్న వారితో పెద్ద యుద్ధమే చేస్తున్నామన్నారు. సోమవారం సీఆర్డీఏ పరిధిలో పేదలకు 50,799 ఇళ్ల నిర్మాణం, 45 సామాజిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో సీఎం జగన్ మాట్లా డారు. తొలుత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం టేఅవుట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ శంకుస్థావన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరు కుని లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే…..
సీఆర్డీఏలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా. ఇళ్లు కట్టించకుండా చంద్రబాబు, దత్తపుత్రుడు సృష్టించిన ఊరు పేరూ లేని సంఘాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 అడ్డు తగిలాయి.. వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. ఇందుకోసం ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లిన దౌర్భాగ్యమైన పరిస్థితిని మన రాష్ట్రం లో మాత్రమే చూస్తున్నాం. ఈ పెద్దమనుషులు, పెత్తందార్లు, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో 5 కేసులు వేశారు. ఈ కేసులను పరిష్కరించేందుకు మీ తరఫున మీ బిడ్డ మూడేళ్ల పాటు పోరాటం చేస్తూ వచ్చాడు. ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ మంచికే ఉం టాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచింది. అనుమతులు తెచ్చుకుని మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపో యారు కాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి అడ్డు తగిలేం దుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కేంద్ర ప్రభుత్వం లో వారు ఎక్కని గడప దిగని గడప లేదు. కలవని కేంద్ర మంత్రి, కేంద్ర సెక్రటరీలు కూడా లేరు. ఇం తమందిని కలిశాక చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారు. ఇలాంటి దారుణమైనపరిస్థితి ఎప్పుడూ ఎక్కడా ఉండదు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అమరావతిని పేరుకేమో రాజధాని అంటారు. రాజధానిలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఒక సెంటు స్థలం ఇచ్చి

చరిత్రలో నిలిచిపోయే రోజు
ఇంతమంది పెత్తందార్లు ఒక్కటై పేదవాడికి ఇళ్లు. రాకూడదని అడ్డుకునేందుకు ముమ్మరంగా ప్రయ త్నించిన పరిస్థితులు దేశ చరిత్రలో ఎప్పుడూ గుర్తుం డిపోతాయి. ఇలా పేదల కత్రువులతో ఎంతో సంఘర్షణ, ఎన్నెన్నో అవరోధాలను అధిగమించి విజ యం సాధించి పేదల ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలి చిపోతుంది. మీ ఇళ్ల నిర్మాణానికి, మీ ఇంటి కలల సాకారానికి ఇవాళ ఇక్కడ పునాదులు కూడావేస్తున్నాం. అక్కచెల్లెమ్మం సొంతింటి కలల సాకా దానికి మనం చేసిన సామాజిక న్యాయ పోరాటం: చరిత్ర ఉన్నంత వరకూ ఎప్పుడూ మర్చిపోలేనిది. పెత్తందారులపై పేదవాడు, పేదల ప్రభుత్వం సాధిం చిన విజయంగా చరిత్రలో పదిలంగా ఉంటుంది.

*పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా ఉండదు.*
ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుపడి కోర్టులకు వెళ్లారు. పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంట్యాలెన్స్ సామాజిక అసమతుల్యత) వస్తుందని, కులాల సమతుల్యం దెబ్బతింటుందని న్యాయస్థానాల్లో వాదించిన చరిత్ర వీళ్లది. ఇలాంటి పెత్తం దారులున్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైన మనుషులను, మనస్తత్వాలను, వాదనలను, రాతలను, టీవీల్లో డిబేట్లను, రాజకీయ పార్టీలను గతంలో ఎప్పుడూ చూడలేదు.

*నయా జమీందార్ల మొసలి కన్నీరు.*
గతంలో ఇదే బడ్జెట్ కానీ నేడు పేదలకు అన్ని చేయగలుగుతున్నాడు? ఆ రోజు గజదొంగల ముఠా ఎందుకు చేయలేకపోయింది? మీ బిడ్డ హయాంలో ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తున్నాయి? చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏ పేదవారు. అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని. వలంటీర్, సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్షకు తావివ్వకుండా ఒకటో తారీఖునే ఆది ఆదివారమైనా, పండగరోజైనా సరే తెల్లవారుజామునే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చేతిలో పెన్షన్ డబ్బులు పెడుతున్నారు. ఈ వ్యవస్థను కూడా పెత్తందార్లు, పేదల వ్యతిరేకులు, అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు.

*హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు.*
పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే ఈ నయా జమీం దార్లు, పెత్తందార్లంతా అడ్డుతగిలే కార్యక్రమం చేశారు. తెలుగు భాష ఏమైపోతుందని మొసలి. కన్నీరు కారుస్తారు. ఈ పెత్తందార్ల పిల్లలు, మన వళ్లు, మనవరాళ్లను మాత్రం ఇంగ్లీష్ మీడియం బడు లకే పంపిస్తారు. మన పిల్లలు మాత్రం తెలుగు బడు లకే పోవాలంటారు. నా అక్కచెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తే రకరకాల కోర్టు కేసులు వేశారు. పేదవాడు ఎప్పుడూ పేదవాడుగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ ఆలోచ నకు ఇవొక నిదర్శనాలు. మీ బిడ్డ పేదల కోసం అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్షకు చోటివ్వకుండా బటన్ నొక్కి రూ.2.25 లక్షల కోట్లు పంపిస్తే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తు న్నారు. మీ బిడ్డ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారు.
*ప్రతి ఒక్కరూ ఆలోచించండి.*
గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, చంద్రబాబు హయాంలో కన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల వృద్ధి రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఈ రోజు ఎలా
రేపటి కంటే భవిష్యత్ బాగుండాలని కోరుకుంటుంది. అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అంటారు. అలాంటి ఎదుగు దలను, అభివృద్ధిని అడ్డుకుంటే, వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్ధం, అమానుషత్వం, రాక్షసత్వం అంటారు. విచిత్రమేంటంటే పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ దాన్ని వారు హీరోయిజంగా చిత్రీక దిస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే ఈనాడు పేపర్లో చూశా. వాళ్లు రాసిన రాతలు చూసి ఆశ్చర్యం అని పించింది. దిగజారుడుతనం ఏ స్థాయికి వెళ్లిందంటే చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికా, సింగపూర్ నుంచి మనుషులు రావచ్చట. కానీ ఇదే అమరావతిలో చుట్టుపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఈనా రులో రాస్తారు. ఇంత దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావజాలం ఎక్కడైనా ఉంటుందా?. అని దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *