పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ కాలికి తగిలి ఓ వ్యక్తి అక్క డికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన తాళ్లూరు మండలం లోని నాగంబొట్ల పాలెం గ్రామంలో సోమవారం ఆలస్యం గా వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన శనివారపు రమణారెడ్డి(41) ఆదివారం సాయం త్రం ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరారు. గ్రామ సచివాలయ సమీపంలోని పొలంలో రేకుల షెడ్ వద్ద బైక్ నిలిపి బహిర్భూమికి వెళ్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ మోటారు కోసం ఏర్పాటు చేసిన తీగ తెగి పడి కాలికి తగల డంతో అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి పొద్దుపోయినా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య, కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేశారు. ఫోన్ రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయలేదు. దీంతో చేసేది లేక నిద్రకు ఉపక్రమిం చారు. సోమవారం ఉదయాన్నే పొలం యజమాని శ్రీనివాసరెడ్డి అటుగా వెళ్లగా రమ ణారెడ్డి మృతదేహం పడిఉంది. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విగతజీవిగా పడిఉన్న రమణారెడ్డిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య లక్ష్మీ, కుమార్తెలు వర్షితరెడ్డి, గౌతికారెడ్డి ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ప్రేమ్ కుమార్ సందర్శించారు . మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

