మణిపూర్ లో క్రైస్తవులపై జరిగిన హింసా త్మక, అమానవీయ ఘటనలపై దర్శి పాస్టర్స్ ప్రీయర్ ఫెలోషిప్, దర్శి మండల పాస్టర్స్ ఫెల్లోషిప్ ఆధ్వర్యంలో సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. పాస్టర్లు, క్రైస్తవులు భారీ సంఖ్యలో హాజర య్యారు. పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల అధ్యక్షులు డేవిడ్ ఆర్సన్, బండి మార్కు మాట్లా డుతూ హింసాత్మక ఘటనలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశాన్ని కాపా
డిన సైనికుడి భార్యను ఘోరంగా నగ్నంగా ఊరేగించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నారని, క్రైస్తవుల మనుగడ కష్టంగా మారిందని అన్నారు. కార్యక్రమంలో పాస్టర్లు గాలిమూటి దేవప్రసాద్, కేసనపల్లి నాగేశ్వరరావు, జీ ఏసుదాసు, బెజవాడ అనీల్, ఏసుబాబు, జీఎస్ పాల్, డానియేల్పాల్, జీ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
