దర్శి మండల పరిషత్ సమావేశo హాలు నందు దర్శి వ్యవసాయ సబ్ డివిజన్ వ్యవసాయ అధికారులు మరియు ఎంపిక చేయబడిన భరోసా కేంద్ర సిబ్బందికి 2023 ఖరీఫ్ సీజన్లో చేయబోవు ఈ క్రాప్ బుకింగ్ విధానాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దర్శి సహాయ వ్యవసాయ సంచాలకులు కే బాలాజీ నాయక్ మాట్లాడుతూ … ఈ సంవత్సరం కొత్తగా జియో రెఫరెన్స్ విధానంలో పొలం యొక్క అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా నమోదు చేస్తారని తెలియజేశారు. అలాగే రైతులు వాస్తవంగా సాగు చేసిన పంటలను మాత్రమే మోదు చేయాలని ఆదేశించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో ముందుగానే ప్రణాలిక తయారు చేసుకుని రైతు భరోసా కేంద్రం మరియు సచివాలయంలో రైతులకు తెలిసేటట్లు ప్రదర్శించి నమోదు చేయాలని కోరారు. ఏ రోజు ఏ సర్వే నెంబర్లలో పంట నమోదు చేయబోతారో ఒక రోజు ముందుగానే రైతులకు తెలియజేయాలని చెప్పారు. మండల రెవెన్యూ అధికారులను కలిసి ఆయా గ్రామాల్లో ఏంతమేర సాగు భూమి ఉందో అలాగే వ్యవసాయతర పొలాలు అనగా ప్లాట్లు ఈడు భూములు బంజరు భూముల వివరాలను ముందుగానే కనుక్కోవాలని తెలిపారు. జాయింట్ అజమాయిషీ విధానంలో అనగా గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారి, వ్యవసాయ సహాయకులు, గ్రామ సర్వేయర్ ల తో కూడిన బృందాలు పంట పొలాన్ని సందర్శించి మాత్రమే పంట నమోదు చేయాలని ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి వి. బాలకృష్ణ నాయక్ మరియు డివిజన్లోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

