దర్శి పట్టణంలోని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) భవనం నిర్మాణా నికి మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ నాయకులు శిద్దా రాఘవరావు రూ.75 వేల ఆర్థిక సాయం అందించారు. శిద్దా రాఘవరావు ప్రతినిధులు మాండాది సుబ్బారావు, కంచర్ల శ్రీనుల చేతుల మీదుగా ఈ సాయాన్ని అందించారు. యూటీఎఫ్ నాయకులు శిద్దాకు కృతజ్ఞతలు తెలిపారు. యూ టిఎఫ్ నేతలు డి. వెంక టరెడ్డి, మీనిగ శ్రీను, ఖాళీం, వెంకటేశ్వర్లు, టి. చెంచయ్య, జేవీవీఎం సుధాకర్, టి. రాజశేఖర్, ఎస్. తిరుపతిరెడ్డి, ఇ. రోశయ్య, వి. రామిరెడ్డి, కమ్మ, శ్రీను, ఏ. రామారావు, బి, రామాంజనేయులు, మాలకొండయ్య, బీకోటిరెడ్డి, ఎంవీ రమణారెడ్డి, కె. విజయభాస్కర్, జి. విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.
