దివ్యాంగులకు ప్రభుత్వం తక్కువ వడ్డీతో తిరిగి చెల్లించే పద్ధతిలో రుణాలు అం దజేస్తుందని జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసుండి కనీసం 40 శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు ఆగస్టు 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాణిజ్య, వ్యాపార, సేవా రంగాల్లో జీవనో పాధినిమెరుగుపరుచుకునేందుకు ఈ రుణాలు పొందవచ్చన్నారు. కేవలం 6 శాతం వడ్డీతో రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు జిల్లాస్థాయి ఎంపిక కమిటీ ద్వారా మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు కావాల్సిన వారు లబ్ధి దారుని వాటా కింద 5 శాతం చెల్లించాల్సి ఉం టుందన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న దివ్యాంగులు నిర్ణీత వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూరించి సంబంధిత ధ్రువపత్రాలతో ఆగస్టు 10వ తేదీలోగా జిల్లా మేనేజర్, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకుడు, ఒం గోలు కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 08592-281310 నంబర్ను సంప్రదించాలని కోరారు.
