వేలం డబ్బు చెల్లించకుండా లక్కవరం గ్రామ చెరువులో చేపల పెంపకం -పాట దక్కించుకున్న వారు చెల్లించాల్సింది రూ. 56లక్షలు – చెల్లించకపోయిన కిక్కురుమనని అధికారులు ఆరునెలల నుంచి చేపలు పెంచుతున్నా చర్యలు శూన్యం

పోటాపోటీగా చేపల చెరువులను వేలం పాడిన వారు అంతే పోటాపోటీగా గ్రామ పంచాయతీకి డబ్బు చెల్లించకుండా చెరువులో చేపలను పెంచుతున్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని లక్కవరం గ్రామ పరిధిలో ఇటువంటి పరిస్థితి నెలకొన్నది.
లక్కవరం గ్రామ పంచాయతీకి ప్రధాన ఆదాయ వనరుగా రెండు చెరువులున్నాయి. వాటిల్లో చేపల పెంపకానికి వేలం పాటలు నిర్వహించి వచ్చిన డబ్బుతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెరువుల్లో చేపల పెంపకానికి వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన లోకిరెడ్డి చిననరసింహారెడ్డి రూ.25 లక్షల 10వేల రూపాయలకు పెద్ద చెరువును, వినుకొండకు చెందిన భీమనాథం శ్రీనివా సులు రూ.31లక్షల 11 వేల రూపాయలకు చిన్నచెరువులో చేపల పెంపకం హక్కును దక్కించుకున్నారు. పాట దక్కించుకున్న ఇరువురు పంచాయతీకి డబ్బులు చెల్లించకుండా చేపపిల్లలు వేసి పెంచుతున్నారు. అలా ఎలా అనుమతి ఇచ్చారని అప్పటి గ్రామ కార్యదర్శి నూరుల్లాను గ్రామ ఉపసర్పంచ్ పెద్దయ్య, వార్డుసభ్యులు పలుమార్లు అడిగినా ఫలితం లేక పోయింది. పాట దక్కించుకున్న ఇద్దరు వైసీపీ నేతలు కావ టంతో అధికారులు మిన్నకున్నారని ఉపసర్పంచ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. చినచెరువు పాటదక్కించుకున్న పాటదారునికి గ్రామ మాజీ సర్పంచ్ అండదండలతోనే పంచాయతీకి డబ్బులు చెల్లించలేదన్న ఆరోపణలున్నాయి. చిన చెరువుకు డబ్బులు కట్టకుండా చేపపిల్లలు వేయటంతో పెద్ద చెరువుపాట దక్కించుకున్న నరసింహారెడ్డి కూడా చేపపిల్లలు వేసి పెంచుతున్నారు. ఇరువురు పోటాపోటీగా పంచాయితీకి పాట డబ్బులు చెల్లించకుండా చేపల పెంపకం యథేశ్చగా చేప ట్టారు. గ్రామకార్యదర్శి మాత్రం ఏదో మొక్కుబడి నోటీసు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఆయా కాంట్రాక్టులకు అండగా నిలుస్తున్న అధికార యంత్రాంగం ఆరు నెలలగా చేపల వేలం పాట డబ్బులు గ్రామపంచాయితీకి చెల్లించకపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ ఉప సర్పంచ్ వర్గీయులు మద్దిపాడులో జరిగిన స్పందన కార్యక్రమంలో ఈ విషయమై దరఖాస్తు అందజేశారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి గ్రామపంచాయతీకి
చెల్లించాల్సిన రెండు చెరువుల చేపల పాట డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుని గ్రామంలో అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నోటీసు ఇచ్చి డబ్బులు చెల్లించకుంటే పాట రద్దు చేస్తాం-వై.శ్రీనివాసరావు, ఎంపీడీవో

చేపల పెంపకం చేపడుతున్న వారికి డబ్బులు చెల్లింపుపై నోటీసులు జారీ చేస్తాం. నోటీసుకు స్పందించి డబ్బులు చెల్లించకుంటే వేలం పాటను రద్దుచేసి మళ్లీ వేలం పాట నిర్వహిస్తాం. ప్రస్తుతం చెరువులందు పెరుగుతున్న చేపలను పాట దక్కించుకున్న వారికి అప్పచెబుతాం అని ఎంపీడీవో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *