గూడ వెంకట రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తేజ వయో వృద్ధాశ్రయానికి చేయూత ఇచ్చారు. గూడ వెంకట రెడ్డి కుమారుడు గూడ చిన బ్రహ్మా రెడ్డి కుమారుడు గూడ శ్రీధర్ రెడ్డి, గూడ ప్రసాద రెడ్డిల ఆధ్వర్యంలో రూ. 57వేల విలువైన బియ్యం, నూనె, కంది పప్పు ఇతర నిత్యావసరాలు అందించారు. గూడ సుబ్బా రెడ్డి, గూడ గోపాల రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, యేరేసి బ్రహ్మా రెడ్డి, యత్తపు కాశి రెడ్డి, గూడ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





