కారంచేడు గ్రామం బాపట్ల జిల్లా
ప్రముఖ ఎరువుల ఉత్పత్తి సంస్థ పారాదీప్ ఫాస్పెట్ లిమిటెడ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో గురువారం బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో శ్రీ శ్రీనివాస ఏజెన్సీ సహకారంతో ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి మరియు రైతు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పారాదీప్ ఫాస్పెట్ లిమిటెడ్ రీజనల్ హెడ్ కృష్జ మూర్తి మాట్లాడుతూ …దేశవ్యాప్తంగా 8,650 ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు తమ సంస్థ ద్వారా ప్రారంభించడం జరిగింది అని తెలిపారు. రైతు సంక్షేమం కోసం,వారి అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రవేశపెట్టి రైతులకు అండగా వుండే విధంగా ఈ పధకం అమలు లక్ష్యం అని దేశవ్యాప్తంగా రైతులకు లాభం చేకూర్చే విధంగా పారాదీప్ ఫాస్పేట్ లిమిటెడ్ సంస్థ లాభాపేక్ష లేకుండా తమ సేవలు అందించడం జరిగింది అని అన్నారు. ఎరువుల సబ్సిడీలలో దేశవ్యాప్తంగా ఓకే ఎరువు ఓకే బ్రాండ్ భారత్ పేరుతో రైతులు శ్రమ లేకుండా తీసుకొవచ్చు అని తెలిపారు.
సంస్థ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రఫీ మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎరువు అనే నినాదంతో ఈ అవకాశం ఏర్పాటు చేయడం రైతులకు ఉపయోగాకరంగా ఉంటుందిఅన్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను మోడల్ ఫర్టిలైజర్ రిటైల్ షాప్ గా సేవలు అందిస్తూ ఈ కేంద్రాలలో రైతుల కావలసిన ఎరువులు, విత్తనాలు,వ్యవసాయ పరికరాలు ఒకే చోట లభ్యం అవుతాయాని తెలిపారు. అదేవిధంగా కేంద్రం నుంచి రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి నిధి 14వ విడతగా 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు ₹2000 చొప్పున రూ 17.500 కోట్లు ప్రధానమంత్రి గారు రైతుల ఖాతాలకు జమ చేయుచున్నారు అని రఫీ తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు, ఒంగోలు మార్కెటింగ్ ఆఫీసర్ పి.ప్రభాకర్, శ్రీ శ్రీనివాస ఏజన్సీ యజమాని కొల్లశ్రీరాములు,కొల్ల రాజేష్ ,బాపట్ల జిల్లా బి.జె.పి అధ్యక్షులు మువ్వ రమణారావు, కారంచేడు మండల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


