తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం పంచాయతీ గంగపాలెం మొహర్రం వేడు కల్లో వైఎస్సార్ సీపీ తాళ్లూరు మండల ఇంచార్జి మద్దిశెట్టి రవీం ద్ర పాల్గొన్నారు. గ్రామంలో గురువారం పీర్ల పండగను ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ముస్లిం నాయకులు డాక్టర్ మైసూర్ బాలాజీ, లాల్ లు ఏర్పాటు చేసిన పీర్ల ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, సర్పంచ్ బ్రహ్మా రెడ్డి, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ కమిటీ సభ్యులు సోము అనిల్ కుమార్ రెడ్డి, బెల్లంకొండవారిపాలెం, రజానగరం సర్పంచ్ లు పోశం సుమలతా శ్రీకాం త్ రెడ్డి, వలి, మాజీ సర్పంచ్ ఓబుల్ రెడ్డి, దర్శి కౌన్సిలర్ వీసీరెడ్డి, నాయకులు యలమందా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

