గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని పొన్నెకల్లు గ్రామంలో
ప్రముఖ ఎరువుల ఉత్పత్తి సంస్థ పారాదీప్ ఫాస్పెట్ లిమిటెడ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో శ్రీ చంద్ర ఎంటర్ప్రైజెస్
సహకారంతో ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి మరియు రైతు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పారాదీప్ ఫాస్పెట్ లిమిటెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ పివి సుభాష్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం,వారి అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రవేశపెట్టి రైతులకు అండగా వుండే విధంగా ఈ పధకం అమలు లక్ష్యం అని దేశవ్యాప్తంగా రైతులకు లాభం చేకూర్చే విధంగా పారాదీప్ ఫాస్పేట్ లిమిటెడ్ సంస్థ లాభాపేక్ష లేకుండా తమ సేవలు అందించడం జరిగింది అని అన్నారు. ఎరువుల సబ్సిడీలలో దేశవ్యాప్తంగా ఓకే ఎరువు ఓకే బ్రాండ్ భారత్ పేరుతో రైతులు శ్రమ లేకుండా తీసుకొవచ్చు అని తెలిపారు.
కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరసింహారావు , మార్కెటింగ్ ఆ ఆఫీసర్ పి వి సుభాష్, శ్రీ చంద్ర ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ పి రామారావు మరియు గ్రామములో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


