భావి తరాలకు పచ్చని పర్యావరణ తో ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. రజానగరం, మల్కాపురం క్షేత్ర పర్యటనలో బాగంగా రైతు భరోసా కేద్రంలో వేప మొక్కలను నాటారు. దానిని సంరక్షించి పెంచితే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఆర్.బి.కె లో మొక్కలు నాటటం వాటిని సంరక్షించటం పచ్చదనాన్ని ప్రోత్సాహించేలా గ్రామ వ్యవసాయ సహాయకులు, చొరవ చూపాలని కోరారు. ఎఈఓ నాగరాజు, విఏఏ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
