దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు మద్దిశెట్టి వాసు కుమారుడు అభినవ్ ( యూ .ఎస్. ఏ) జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దర్శిలోని కాశినాయన, షిర్డి , వెంకట రమణ వృద్ధాశ్రమాలలో వారం రోజుల పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు మద్దిశెట్టి యువసేన సభ్యులు చెప్పారు. ఆయా ఆశ్రమాలలో శుక్రవారం వైసీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర ప్రారంభించారు. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





