స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీఓ మురళి కోరారు. తాళ్లూరు పంచాయితీ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్-2023ను గ్రామ సర్పంచి మేకల చార్లెస్ సర్జన్ ప్రారంభించారు. వలంటీర్లు ఆయా పరిధిలో ప్రజలు
మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారా లేదా, చెత్త శుద్ది పాటిస్తున్నారా లేదా పొడి, తడి చెత్త వేరు చేయు విధానంపై అవగాహన ఉందా లేదా, మరుగుదొడ్ల పరిశుభ్రత ఉపయోగించటం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామకార్యదర్శి లక్ష్మికాంత్, మహిళా పోలీస్ భవాని క్రిష్ణారెడ్డి, సచివాలయ ఉద్యోగులు చిరంజీవి, క్రిష్ణారెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు.




