ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ శుక్రవారం దర్శి ఎన్ఎస్పి కాలువ పై పర్యటించి తాగునీటి పంపింగ్ కోసం ఏర్పాటు చేసిన మోటార్లను, జెనరేటర్ లను పరిశీలించారు. అనంతరం ఫిల్టర్ బెడ్స్ ను పరిశీలించి ఆర్ఎస్ఎఫ్ పనిచేయు విధానం ను తెలుసుకున్నారు.ఈ సందర్భముగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ…. జిల్లా పరిషత్ నిధుల నుండి ప్రజలకు త్రాగు నీరు అందించాలని సాగర్ కాలువల వెంట రూ.50 లక్షల రూపాయలతో కరెంట్, జనరేటర్ అవసరాల కోసం విడుదల చేయడం జరిగినది అని… ఎక్కడ రాజీ పడకుండా అధికారులు నీటిని మల్లించాలని అదికారులను ఆదేశించామని తెలిపారు. సాగర్ నుండి తాగు నీటి కోసం నీళ్ళు వదలడం జరిగినది అని అన్నారు. దర్శి మండల ప్రజలకు స్వచ్చ మైన నీరు అందించాలని మరో ఆర్ ఎస్ ఎఫ్ ను కూడా త్వరలో జిల్లా పరిషత్ నిధుల నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు.అధికారులు ,స్కీమ్ నిర్వహకులు ఎక్కడ రాజీ పడకుండా ప్రజలకు స్వచ్చ మైన నీరు అందించాలని కోరారు. కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఎం బాషా,మాజ ఏఎంసీ చైర్మన్ కె.వి రెడ్డి, మాజీ ఎంపీపీలు ఇత్తడి దేవదానం, వీరగందం కోటయ్య, కురిచేడు జడ్పిటిసి నుసుం నాగి రెడ్డి,మాజీ సర్పంచ్ చంద్రగిరి గురవా రెడ్డి, దర్శి వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, దర్శి మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.







