మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వ్యాపారం నిర్వహించుకునేం దుకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిస్తారని ఏపీఎం పి. దేవరాజ్ తెలి పారు. తాళ్లూరు వైఎస్సార్ క్రాంతిపథం కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఏపీఎం పి. దేవరాజ్ మాట్లాడుతూ ….అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం ద్వారా పాడి గేదెల కొనుగోలుకు రుణాలు మంజూరు చేస్తారన్నారు. మిగిలిన వారికి ఎలాంటి వ్యాపారం నిర్వహించుకోదల చినా అందుకు సంబంధించిన వివరాలు తెలియ జేస్తే రుణాలు ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. మండల సమాఖ్య ప్రతినిధులు ఎం.ఎం.ఎస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, సీసీలు కోటేశ్వరమ్మ, సుచేంద్ర పాల్గొన్నారు.
వ్యాపార అభివృద్ధికి రుణాలు -ఏపీఎం పి. దేవరాజ్
29
Jul