ఫిల్టరెబెడ్ల మరమ్మతులకు రూ.25 లక్షలు మంజూరు-జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

కురిచేడు మండల ప్రజల తాగునీటి అవసరాల కోసం ఎన్ఏపీ ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రకటించారు. స్థానిక అట్లపల్లి చెరువును, ఫిల్టర్ బెడ్లను ఆమె శుక్ర వారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సాగర్ కాలువకు తాగునీటి అవస రాల కోసం నీటిని విడుదల చేశారని, వాటిని చెరువుకు నింపి నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. అలాగే రైల్వే స్టేషను వద్ద పెద్దచెరువును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆర్డబ్ల్యూఎస్ డీఈ బీ రంగారావు వివరించారు. ఎస్సీ కాలనీ వారికి శ్మశాన వాటికలో గది నిర్మాణం, చుట్టూ కంచె ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. మండల ప్రజల తాగునీటి అవసరాల కోసం 13 ఏళ్ల క్రితం అప్పటి దర్శి ఎమ్మెల్యే బూచేప ల్లి సుబ్బారెడ్డి రూ.10 కోట్లు మంజూరు చేయించారని జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి గుర్తుచేశారు. ఆ పథకం కొన్ని కారణాల వలన సఫలంకాలేదని, కానీ పైపులైన్లు, గ్రామాల్లో ఓవర్హెడ్ ట్యాంకు నిర్మించారని, వాటిని జేజేఎం పథకంలో సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. పెద్దచెరువులో వంద ఎకరాలు తాగునీటి చెరువుగా అభివృద్ధి చేస్తే మండల ప్రజల తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. పెద్ద చెరువు తూము పూడిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దాని మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని వెంకాయమ్మను కోరారు. జెడ్పీచైర్పర్సన్ వెంట సర్పంచ్ కేసనపల్లి కృష్ణయ్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డా బాషా,నాయకులు నారు శ్రీనివాసరెడ్డి, ఊట్ల వెంకటే శ్వర్లు, గోగులముడి లింగారెడ్డి, వీరగంధం కోటయ్య, నుసుంప్రతాపరెడ్డి, పాతకోట వెంకట రెడ్డి, మువ్వా శ్రీనివాసరావు, వెలుతుర్ల ఏడుకొండ లరెడ్డి, పాపయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, గోవిందు, నాగిరెడ్డి, ఆసుపల్లి చెన్నారెడ్డి, దాసరి రమేష్ , పత్తి సుబ్బయ్య, బత్తుల చిన సుబ్బయ్య, ఎంపీడీవో వసంతరావునాయక్, ఈఓఆర్డీ ఆర్వీఎస్ ప్రసాదరావు, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ యం థావూ నాయక్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *