నిర్మాణాలు పూర్తి చేసుకున్న జగనన్న కాలనీలకు నూతన మీటర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ డీఈఈ కే పిచ్చయ్య అన్నారు. ముండ్లమూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాడీఈఈ కే పిచ్చయ్య మాట్లాడుతూ… ముండ్లమూరు మండలంలో జగనన్న లే అ వుట్ లకు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అలానే నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లకు విద్యుత్ మీటర్లను బిగించాలన్నారు.
