ప్రాణత్యాగానికి ప్రతీకగా నిలిచిన పీర్ల పండుగ మూడవరోజు పెద్ద షరిగత్ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం నుండి మండలంలోని మాధవరం, తూర్పు గంగవరం, సోమవరప్పాడు, రమణాలవారి పాలెం, రామభద్రపురం, నాగం బొట్ల వారి పాలెం, బొద్ధి కూరపాడు తదితర గ్రామాలలోని పీర్ల చావిడిల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. డప్పు వాయిద్యాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించబడి పూలమాలలతో ప్రత్యేక ఆకర్షణీయంగా పీర్లను అలంకరించి ఉత్సవాల కొరకు ముస్తాబు చేశారు. ముఖ్యంగా తూర్పు గంగవరం గ్రామంలోని యత్తపు వారి వీధిలోని పీర్ల చావిడిలో 35 సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా పీర్ల పండుగ ఉత్సవాలు గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పరమత సహనాన్ని చాటిచెబుతూ యత్తపు వారి వీధిలోని హిందువులు భక్తిశ్రద్ధలతో పీర్లకు దేవతలకు నైవేద్యాలను సమర్పించి తమను తమ వీధిని ప్రజలను కాపాడాలని కోరుకున్నారు. మహమ్మద్ ప్రవక్త మనుమలైన హసన్, హుస్సేన్ ల ప్రాణత్యాగంతో నిర్వహించబడుతున్న ఈ మొహరం పండుగ వేడుకల వల్ల ఆ దేవతలు తమను కాపాడాలని వేడుకున్నారు.
ఘనంగా పీర్ల పండుగ నిర్వహణ – పీర్ల చావిడి వద్ద పండుగ వాతావరణం – ప్రత్యేక ఆకర్షణతో పీర్ల – పరమత సహనాన్ని చాటుతూ హిందువుల సైతం ప్రత్యేక నైవేద్యాలు
29
Jul