తాళ్లూరు మండలం గుంటిగంగ సమీపంలో శివరాంపురం అడ్డ రోడ్డు సమీపాన శనివారం రాత్రి మోటార్ సైకిల్ ని కట్టెల ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో తల్లి మృతి చెందగా, కుమారుడు పరిస్థితి ఆందోళన కరంగా వుంది. అందిన సమాచారం మేరకు రామభద్రాపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు అబ్దుల్ రజాక్ భార్య షేక్ మస్తాన్ బీ (46), తన సవతి కుమారుడు షేకమున్నీతో కలిసి ఉదయం పనిమీద ఒంగోలు వెళ్లారు. సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటికి తిరిగివస్తుండగా శివరాంపురం అడ్డరోడ్డు సమీపానగల కంకర మిల్లు వద్దకు చేరుకునే సరికి తూర్పు గంగ వరం నుండి చీమకుర్తి వైపు ఎదురుగా కట్టెలలోడు ట్రాక్టర్ వస్తున్నది. చీకట్లో కన్పించక పోవటంతో కట్టెలు వారికి తగిలికింద పడిపోయారు. మస్తాన్ బీ కుడివైపు కణిగి భాగంలోకి కర్రలుచొచ్చుకుని పోవటంతో అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు మున్నీ తలకు కర్రలు తగిలి తీవ్ర గాయలై సృహ తప్పి పడిపోయాడు.
సమాచారం అందుకున్న రామభద్రాపురం గ్రామస్తులు అక్కడకు చేరుకుని మున్నీని చికిత్సకోసం ఒంగోలుకు తరలించారు. మున్నీ విజయవాడ నందువైద్య కోర్సు చదువుతున్నాడు.



