తాళ్లూరు మండ లంలోని రమణాలవారిపాలెం గ్రామంలో కై పు రాజశేఖరరెడ్డి అనే యువకుడు అదృశ్యం పై శనివారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ మోహనరావు తెలిపారు. రమణాలవారి పాలెం గ్రామానికి చెందిన ఎల్. బ్రహ్మారెడ్డి బంధువు అయిన రాజశేఖరరెడ్డిది నరసరా వుపేట జిల్లా క్రోసూరు మండలం దొండ్లేరు గ్రామం. అతని తల్లి పద్మ గుంటూరు వైద్యశా లలో చికిత్స పొందుతోంది. పద్మని చూసేం దుకు వెళ్లిన బ్రహ్మారెడ్డి.. మతిస్థిమితం లేకుం డా అక్కడ ఇబ్బంది పడుతున్న రాజశేఖర రెడ్డిని ఈ నెల 16న రమణాలవారిపాలెం తీసుకొచ్చాడు. రెండు రోజులు బాగానే ఉన్న రాజశేఖరరెడ్డి.. ఈ నెల 19వ తేదీ బహిర్భూ మికని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. వెతికినా కనిపించకపోవడంతో శనివారం స్థానిక పోలీ స్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ మోహనరావు తెలిపారు. గతంలోనూ రెండు సార్లు రాజశేఖరరెడ్డి ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది.
రమణాల వారి పాలెం కు చెందిన యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
30
Jul