దర్శి దళిత ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి ని సమావేశానికి పిలవకుండా అవమానపరిచిన దర్శి ఎంపీడీవో కుసుమకుమారిపైచర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీపీతో కలసి దళిత ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
దర్శిమండల పరిషత్ సర్వసభ్యసమాశనికి దళిత మహిళలైన దర్శి ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి ని పిలవకుండా అవమానపరచడాన్ని ఖండిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వద్ద దర్శి ఎంపీపీ జి సుధారాణి తో కలసి రాష్ట్రదళితసేన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో “నిరసన ” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రదళితసేన దర్శి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి జి.ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ… దర్శిమండల సర్వసభ్య సమావేశానికి పిలవకుండా అవమానించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని, ఏప్రభుత్వం… అధికారంలోనికి ఉన్నా సరే ..దళితులు మహిళలు అవమానానికి, అత్యాచారానికి, హత్యలకుగురవుతున్నారని ఆయన ఆవేదనకు వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా ప్రభుత్వ చట్ట పరమైన చర్యలు చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు గోళ్ళ పాటిఅచ్చయ్య, మాదిగ మహానాడు దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ గట్టుపల్లి ప్రసాదు, మురికిపూడి ప్రభాకర్, గర్నెపూడి ఏసేబు,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

