సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవీ రమణారెడ్డి కుమారుడు శివశంకర్ రెడ్డి నిశ్చితార్థ వేడుక సందర్భంగా ప్రముఖుల రాకతో రాజకీయ సందడి నెలకొన్నది తాళ్లూరులో ఏ. వి రమణారెడ్డి నివాసంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి బాలినేని శ్రీనివాస రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి , ఎమ్మెల్సీ పి. చంద్రశేఖర్ రెడ్డి , ఒంగోలు కార్పొరేషన్ చైర్మన్ గంగాడ సుజాత , వైసిపి తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మారం వెంకారెడ్డి, కె. వి. రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లాలోని అనేక విద్యాసంస్థల ప్రముఖులు హాజరై కాబోయే దంపతులకు ఆశీర్వదించారు. దీవెనలు అందించిన వారిలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీలు ఎడమకంటి వెంకటేశ్వరరెడ్డి, మంచాల ప్రియాంకనాగార్జునరెడ్డి, కోఆప్షన్ సభ్యులు కరి ముల్లా, సర్పంచ్లు చార్లెస్ సర్జన్, సుమలతాశ్రీకాంత్ రెడ్డి, వలి, గంగిరెడ్డిపాలెం యలమందారెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా బాలినేని కి స్థానిక మండల ప్రజా పరిషత్ వద్ద వైఎస్ఆర్సిపి తాల్లూరు మండలం ఇంచార్జ్ మద్దిశెట్టి రవీంద్ర, ఎం.పి.పి తాటికొండ శ్రీనివాసరావు ల ఆధ్వర్యంలో వైసిపి సీనియర్ నాయకుడు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.
*బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం…*
వైసిపి సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ల కు మాజీ ఎంపీపీలు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎంపీపీ లో కోట రామిరెడ్డి, పోశం మధుసూదన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐ. వి సుబ్బారెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జక్కుల రామకృష్ణ, దోసకాయలపాడు సర్పంచ్ కేఎస్ వెంకటరామిరెడ్డి తదితరులు స్వాగతం పలికి నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.



