జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం గుంటి గంగ సన్నిధిలో గుంటి గంగా భవాని అమ్మవారికి వైసీపీ నాయకుడు, మద్దిపాడు మాజీ ఏఎంసీ చైర్మన్ , గుండె అంగాభవానిలో వసతి గదుల ఏర్పాటుకు సహకరించిన దాత మారం వెంకారెడ్డి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వెంకారెడ్డికి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. శాలువాకప్పి, అమ్మవారి ప్రతిమను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి విజయలక్ష్మీ, ఆర్ ఏ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

