తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమని వక్తలు అన్నారు. తాళ్లూరు మండలంలో పలు పంచాయతీలో బుధవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. తాళ్లూరులో ఐసిడిఎస్ కార్యాలయం ఆవరణలో సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలతో సమావేశం ఏర్పాటు చేసారు. సూపర్వైజర్ మాట్లాడుతూ …తల్లిపాలు బిడ్డకు మొదటి వ్యాక్సిన్ వంటిదని అన్నారు. తల్లిపాలు తాగించటంతో తల్లిపై బిడ్డకు ప్రేమ, అప్యాయతలు అలవాటు పడతాయని అన్నారు. అనంతరం జగనన్న సంపూర్ణ పోషణ పౌష్టిక ఆహారం అందించారు. తాళ్లూరులో సర్పంచ్ మేకల చార్లెస్ సర్జన్, మహిళా పోలీస్ భవాని తదితరులు పాల్గొన్నారు. వెలుగు వారి పాలెం లో సర్పంచ్ ముచ్చుమారి కోటేశ్వరమ్మ అంగన్వాడీ టీచర్ రమణ తదితరులు పాల్గొన్నారు. తూర్పు గంగవరం లో ఎంపీటీసీ కోటేశ్వరమ్మ పౌష్టికాహారాన్ని అందించారు.



